లేటెస్ట్..వింటేజ్ ప్రభాస్ ని విట్నెస్ చెయ్యడానికి ముహూర్తం ఖరారు.!

లేటెస్ట్..వింటేజ్ ప్రభాస్ ని విట్నెస్ చెయ్యడానికి ముహూర్తం ఖరారు.!

Published on Jan 13, 2024 1:24 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “సలార్” తో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత తన నుంచి మరో సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898ఎడి” రిలీజ్ ని కూడా మేకర్స్ ఫిక్స్ చేసేసారు. ఇక ఇప్పుడు మూడో హై ఇస్తూ దర్శకుడు మారుతితో చేస్తున్న మరో చిత్రంపై అయితే మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు. మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇది వరకే సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఇప్పుడు ఫైనల్ గా దీనిని రివీల్ చేశారు. వింటేజ్ ప్రభాస్ ని విట్నెస్ చేయడానికి తన ఫస్ట్ లుక్ సహా టైటిల్ ఏంటి అనేది కూడా ఈ జనవరి 15న డేట్ ఫిక్స్ చెయ్యగా ఆరోజు తెల్లవారు జామునే కోడి కూత తర్వాత 7 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు ముహూర్తం ఖరారు చేసేసారు. మరి ఇంతలా ఊరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాదిలో రిలీజ్ కి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు