లేటెస్ట్ : వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ట్రమెండస్ బ్యూటీ త్రిష

Published on Sep 8, 2023 7:02 pm IST

నాలుగు పదుల వయసులో అడుగుపెట్టినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు డైటింగ్, ఫిట్నెస్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ యంగ్ గా కనపడుతున్నారు త్రిష. తొలిసారిగా నీ మనసు నాకు తెలుసు మూవీ ద్వారా కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష అక్కడి నుండి వరుసగా అవకాశాలతో అనేక బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ కొనసాగారు. కాగా ఇటీవల మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు.

అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, తాజాగా ఆమె వరుస బడా మూవీ ఆఫర్లని అందిపుచ్చుకున్నారు. ముందుగా ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న లియోలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. అలానే తలా అజిత్ కుమార్ 62వ మూవీ, ధనుష్ 50వ మూవీ, మణిరత్నం తో తదుపరి కమల్ హాసన్ చేయనున్న మూవీస్ తో పాటు సాతురంగ వెట్టై 2 లో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అవి కనుక సక్సెస్ అయితే హీరోయిన్ గా త్రిష కు మరింత క్రేజ్, అవకాశాలు పెరగడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :