“ఇండియన్ 2” పై రెండు లేటెస్ట్ అనౌన్సమెంట్స్.!

Published on Aug 24, 2022 8:00 am IST

పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని ఉన్న పలు చిత్రాల్లో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా అలాగే విజనరీ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ సీక్వెల్ “ఇండియన్ 2” కూడా ఒకటి. తమ కాంబో నుంచి వచ్చిన తమిళ్ భారీ ఇండస్ట్రీ హిట్ ఇండియన్ కి సీక్వెల్ గా వస్తున్న ప్రస్తుతానికి తగ్గట్టుగా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మరి శంకర్ అయితే కొన్ని అవాంతరాల అనంతరం ఫైనల్ గా ఈ సినిమా షూట్ కోసం రెడీ అయ్యారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై రెండు అనౌన్సమెంట్స్ బయటకి వచ్చాయి. ఈ చిత్రానికి ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ తో పాటుగా ఈ చిత్రం రిలీజ్ నిర్మాణంలో మరో ప్రముఖ సంస్థ రెడ్ జయింట్ వారు కూడా భాగం అయ్యినట్టుగా మేకర్స్ సహా హీరో కమల్ కూడా ఈరోజు అనౌన్స్ చేశారు. ఇక అలాగే తాను కూడా సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలిపి మరో అప్డేట్ అందించారు. ఇక ఈ భారీ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :