ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రెండు సాలిడ్ హిట్స్.!

Published on Mar 22, 2023 7:04 am IST


ఈ ఏడాది ఇప్పటివరకు టాలీవుడ్ మరియు ఇతర భాషల ఇందుష్ట్రీల నుంచి కూడా పలు ఆసక్తికర సినిమాలే ఆకట్టుకునేందుకు వచ్చాయి. మరి వాటిలో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ సినిమా “పఠాన్” కూడా ఒకటి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి ఓ సరైన హిట్ కోసం చూస్తున్న తరుణంలో టోటల్ బాలీవుడ్ సినిమానే కోలుకునే విధమైన హిట్ కొట్టారు.

ఇక మన తెలుగు నుంచి అయితే యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చిత్రం “వినరో భాగ్యము విష్ణు కథ” కూడా ఒకటి. మరి దీనితో ఇతను కూడా మంచి కం బ్యాక్ ని అందుకోగా మరి ఈరోజు అయితే ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసాయి.

మరి పఠాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్స్ టెండెడ్ వెర్షన్ లో అందుబాటులో ఉండగా వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ ఉగాది పండుగ కి అయితే ఈ రెండు సినిమాలు ఓటీటీ వీక్షకులను మంచి ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తాయి.

సంబంధిత సమాచారం :