అల వైకుంఠ పురంలో హిందీ వెర్షన్ విడుదల నిలిపివేత!

Published on Jan 22, 2022 12:22 am IST


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. బాలీవుడ్ లో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇదే తరహా లో అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ చిత్రం అయిన అల వైకుంఠ పురంలో చిత్రం ను హిందీ లో దేశ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. జనవరి 26 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడం మాత్రమే కాకుండా, టీజర్ ను సైతం విడుదల చేయడం జరిగింది.

తాజాగా, గోల్డ్ మైన్స్ ఈ చిత్రం థియేట్రికల్ విడుదల ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అల వైకుంఠపురములో హిందీ వెర్షన్ థియేట్రికల్ విడుదలను ఉపసంహరించుకోవాలని షెహజాదా నిర్మాతలతో పాటు గోల్డ్‌మైన్‌ల ప్రమోటర్ మనీష్ షా సంయుక్తంగా నిర్ణయించుకున్నారు. దీనికి అంగీకరించినందుకు షెహజాదా మేకర్స్ మనీష్ షాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేశారు. కార్తిక్ ఆర్యన్ మరియు కృతి సనన్ నటించిన షెహజాదా, నవంబర్ 4, 2022న విడుదల కి సిద్ధం అవుతోంది. ఇది అల వైకుంఠపురములో చిత్రం కి అధికారిక హిందీ రీమేక్.

సంబంధిత సమాచారం :