మెగాస్టార్ 154 మూవీ లో హీరోయిన్ గా ఈ బ్యూటీ ఫిక్స్

Published on Mar 8, 2022 7:26 pm IST


మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన 154 వ చిత్రం కి సంబంధించిన ఒక అప్డేట్ ను వెల్లడించడం జరిగింది. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం లోకి క్రాక్ భామ శృతి హాసన్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. తాజాగా అందుకు సంబంధించిన పోస్ట్ తో పాటుగా ఫోటో ను షేర్ చేశారు మెగాస్టార్.

విమెన్స్ డే రోజున ఈ విషయం ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 154 వ చిత్రానికి శృతి హాసన్ చేరిక తో మరింత పవర్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చిత్రం ఆచార్య మూవీ ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :