ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా పై లేటెస్ట్ అప్డేట్!

Published on Sep 7, 2021 4:41 pm IST

ఎన్టీఆర్ వరుస సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్, తర్వాత చిత్రం కోసం సిద్దం అవుతున్నారు. ఇప్పటికే జనతా గ్యారేజి అంటూ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఎన్టీఆర్ ఈ సారి మాత్రం పాన్ ఇండియా మూవీ ను ప్లాన్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం కావడం తో సినిమా ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ ఈ నవంబర్ లో మొదలు అయ్యే అవకాశం ఉంది. అంతేకాక మిగతా నటి నటులకు సంబంధించిన వివరాలు త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో లో వస్తున్న ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :