ఆదిపురుష్ కోసం డిఫెరెంట్ మేకోవర్ లో కనిపించనున్న ప్రభాస్!

Published on Sep 11, 2021 12:45 am IST


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం లో ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న లుక్ మరియు వెయిట్ ను చేంజ్ చేసే పనిలో ఓం రౌత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ కోసం ముంబై లో షూటింగ్ లో అన్నారు. అయితే ఈ చిత్రం లో ప్రభాస్ విభిన్న రూపాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సినిమా లో కొన్ని సన్నివేశాల కోసం ఒక నిర్దిష్ట రూపం లోకి ప్రభాస్ రావాల్సి ఉంది.

అందుకోసం ప్రభాస్ కోసం అంతర్జాతీయ డైటిషియన్ లను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా లో భారీ VFX సైతం ఉండటంతో ప్రభాస్ మేకోవర్ పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు ఓం రౌత్. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :