అల్లు అర్జున్, ఫాహద్ ల పై కీలక సన్నివేశాల చిత్రీకరణ…అనుకున్న తేదీకే పుష్పరాజ్!

Published on Oct 4, 2021 10:37 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. పుష్ప చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం పుష్ప ది రైస్. ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను ప్రేక్షకుల తో, అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో నటిస్తుండగా, ఫాహద్ భన్వర్ సింగ్ శేఖావత్ పాత్ర లో నటిస్తున్నారు. వీరిద్దరి మధ్యన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.

అంతేకాక ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ, రిలీజ్ డేట్ ను యధావిధి గా ఉంచడం జరిగింది. పుష్ప చిత్రం విడుదల లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం కాగా, దేవీ శ్రీ ప్రసాద్ సైతం ఈ కాంబో లో చేయడం మూడవ చిత్రం. ఈ చిత్రం డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :