వంశీ పైడిపల్లి – విజయ్ సినిమా పై లేటెస్ట్ బజ్!

Published on Sep 7, 2021 2:34 pm IST


తలపతి విజయ్ హీరో గా వరుస సినిమాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కి బీస్ట్ ను సిద్దం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం తో పాటుగా మరొక చిత్రాన్ని విడుదల చేసేందుకు విజయ్ సిద్దం అవుతున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం లో విజయ్ నటించేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా పండుగ కి మొదలు అయ్యే అవకాశం ఉంది.

అంతేకాక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి లో మొదలు పెట్టేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రాన్ని పక్కా ప్రణాళిక తో దీపావళి పండుగ కి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం వుంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించనున్నారు. విజయ్ 66 వ చిత్రం పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఎలా ఉంటుంది అనే దాని పై ఆసక్తి నెలకొంది. విజయ్ అభిమానులకు మాత్రం వచ్చే ఏడాది డబల్ బొనాంజా అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :