షారుఖ్ “జవాన్” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Apr 1, 2023 7:01 am IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “పఠాన్” తో అయితే సెన్సేషనల్ కం బ్యాక్ ని తాను అందుకోగా నెక్స్ట్ అయితే తాను నటిస్తున్న సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాల్లో కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తో చేస్తున్న ఓ సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “జవాన్” కూడా ఒకటి.

మరి ఈ సినిమా కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా గా ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా అయితే సినిమా షూటింగ్ అంతా మేకర్స్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాని ఇక అనుకున్న సమయానికే రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా అధికంగా ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్టుకి అయితే అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా నయనతార హీరోయిన్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :