లేటెస్ట్ అప్డేట్ : “రామారావు ఆన్ డ్యూటీ” టీజర్ కి డేట్ ఫిక్స్.!

Published on Feb 26, 2022 4:07 pm IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో అన్నీ కూడా ఒకదానితో ఒకటి వైవిధ్యమైన సబ్జెక్టు తో ఉన్నవే అని చెప్పాలి. మరి ఈ లిస్ట్ లో ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మరో చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. నూతన దర్శకుడు శరత్ మందవ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాపై రీసెంట్ గానే స్వయంగా దర్శకుడే అడగకుండా టీజర్ కోసం అప్డేట్ ని అందించారు.

మరి అక్కడ నుంచి మంచి అంచనాలు రైజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ ఆ అప్డేట్ ని సాలిడ్ పోస్టర్ తో అనౌన్స్ చేసారు. ఈ అప్డేట్ ని అందించారు. మరి ఈ మాస్ టీజర్ ని ఈ వచ్చే మార్చ్ 1న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :