అఖిల్ “ఏజెంట్” పై పెరుగుతున్న అంచనాలు!

Published on May 25, 2022 11:00 am IST


అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా బ్యానర్ ల పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో అఖిల్ అక్కినేని మునుపెన్నడూ లేని విధంగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం ఇప్పటికే తనను తాను పూర్తిగా మార్చుకున్నారు అఖిల్. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరో అప్డేట్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం మనాలి లో భీకర యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని టీమ్ వెల్లడించడం జరిగింది. అంతేకాక ఒక వర్కింగ ఫోటో ను విడుదల చేయడం జరిగింది. ఈ ఫోటో లో అఖిల్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు సైతం ఫోటోలు కనిపిస్తున్నారు. ఈ అప్డేట్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నవీన్ నూలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :