“హనుమాన్” టీమ్ నుండి లేటెస్ట్ అప్డేట్!

Published on Mar 30, 2023 2:00 pm IST

టాలీవుడ్ యంగ్ యాక్టర్ తేజ సజ్జ హీరోగా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ నేడు శ్రీ రామ నవమి సందర్భం గా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక హనుమాన్ టీమ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను వెల్లడించారు.

ఈ హనుమాన్ జయంతి కి పవర్ ఫుల్ హనుమాన్ చాలీసా ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం లో అమృత, వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :