కార్తీ సర్దార్‌ పై క్రేజీ అప్డేట్

Published on Jun 14, 2022 12:35 pm IST


కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ చివరిసారిగా సుల్తాన్ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన తదుపరి సర్దార్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పి.ఎస్.మిత్రన్ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజా వార్త ఏమిటంటే, భారతదేశంలో మొదటిసారి, మేకర్స్ అజర్‌ బైజాన్ పార్లమెంటులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రభాస్ సాహో లో విలన్‌గా నటించిన చుంకీ పాండే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్‌గా నటిస్తున్నాడు.

అక్కడ అతనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. దీని తరువాత, షూటింగ్ జార్జియాలో కూడా జరిగింది. మేకర్స్ సింగిల్ షెడ్యూల్‌కే 4 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సర్దార్‌లో రాశి ఖన్నా, లైలా, రజిషా విజయన్ కథానాయికలు గా నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది. 2022 దీపావళికి సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :