“మేజర్” ప్రామిస్ పై నేడు రానున్న క్లారిటీ!

Published on May 6, 2022 12:54 pm IST

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు GMB ఎంటర్ టైన్మెంట్స్, a+s మూవీస్ పతాకాల పై ఈ చిత్రాన్ని మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేడు సాయంత్రం మేజర్ ప్రామిస్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ను జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :