బాలకృష్ణ – గోపీచంద్ సినిమా లేటెస్ట్ అప్డేట్!

Published on Jun 21, 2022 11:00 pm IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక పవర్ ఫుల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికం గా NBK107 ను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం లో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.

ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు సోషల్ మీడియా వేదిక గా ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది. గోపీచంద్, థమన్ మరియు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రితో కలిసి ఉన్న ఒక చిత్రాన్ని విడుదల చేసారు మేకర్స్. అద్భుతమైన ట్రాక్‌లను కంపోజ్ చేసినందుకు థమన్‌పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలో ఈ చిత్రం నుండి మొదటి సింగిల్‌ని విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. NBK 107 అని తాత్కాలికంగా పేరు పెట్టబడిన ఈ యాక్షన్ డ్రామాలో కన్నడ స్టార్, నటుడు దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :