పుష్ప పై పెరుగుతున్న భారీ అంచనాలు…ట్రైలర్ కి ముందు గ్లింప్స్!

Published on Dec 3, 2021 1:23 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట ఈ నెల 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్రైలర్ కట్ పనుల్లో ఉన్న చిత్ర యూనిట్, తాజాగా మరొక అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. ట్రైలర్ కి సంబందించిన గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన అప్డేట్ ను త్వరలో ఇవ్వనుంది చిత్ర యూనిట్. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం లో ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :