“రాధే శ్యామ్” నుండి విడుదల కి సిద్ధమైన మరో ట్రైలర్!

Published on Feb 28, 2022 3:36 pm IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సరికొత్త చిత్రం రాధే శ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ను యూ వి క్రియేషన్స్ పతాకంపై భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను మార్చ్ 11, 2022 న భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

అయితే మరొకసారి మేకర్స్ ఈ చిత్రం కి సంబంధించిన క్రేజీ అప్డేట్ తో ముందుకు వచ్చారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమా రెండో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. చిత్ర ట్రైలర్‌ను మార్చి 2, 2022న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించడానికి వారు చిత్రం యొక్క సరికొత్త పోస్టర్‌ను షేర్ చేసారు. ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి థమన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :