రామ్ పోతినేని – బోయపాటి ల సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!

Published on May 24, 2022 11:33 am IST

అఖండ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కొన్ని నెలల క్రితం అనౌన్స్ చేసిన ఈ సినిమా జూన్ 1, 2022న గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై నిర్మిస్తున్న ఈ సినిమాకి తాత్కాలికంగా #RAPO20 అని పేరు పెట్టారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సౌత్ భాషలతో పాటుగా, హిందీ లో కూడా విడుదల కానుంది. రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వం లో ది వారియర్ లో నటిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :