రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” పై లేటెస్ట్ అప్డేట్

Published on Mar 30, 2022 8:03 pm IST

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో టైగర్ నాగేశ్వరరావు ఒకటి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం కి సంబంధించిన మేజర్ అప్డేట్ ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు నేడు సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది.

చిత్రం నుండి రేపు ఉదయం 09:09 గంటలకు ఒక సర్ ప్రైజ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోస్ట్ తో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు తెలియనున్నాయి. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :