పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఇండస్ట్రీ లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి రిలీజైన గ్లింప్స్ వీడియో కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం తో మేకర్స్ ఫ్యాన్స్ కి ట్రీట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2 న సాయంత్రం 6:03 గంటలకి సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లీల ఈ మూవీ లో లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది.