విజయ్ – లోకేష్ కనగరాజ్ మూవీ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Jun 12, 2022 8:45 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కమల్ హాసన్ టైటిల్ రోల్‌లో నటించిన విక్రమ్ సక్సెస్‌ తో దూసుకు పోతున్నాడు. ఎక్కడ చూసినా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ, భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్, స్టార్ హీరో విజయ్ తో సినిమాని చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు, తాజా సమాచారం ఏమిటంటే, తలపతి 67 అని పిలవబడే ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ గ్యాంగ్‌స్టర్ చిత్రం అని తెలుస్తోంది. ఇటీవల అభిమానులతో జరిగిన ఇంటరాక్షన్‌లో లోకేష్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే విజయ్, వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమాను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 పొంగల్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :