“బ్రో” నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.!

“బ్రో” నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.!

Published on May 28, 2023 10:16 AM IST

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో నటిస్తున్న డివోషనల్ ట్రెండీ ఎంటర్టైనర్ చిత్రం “బ్రో”. దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. మరి పవన్ సహా సాయి తేజ్ పై వచ్చిన లేటెస్ట్ పోస్టర్ లు మంచి బజ్ ని సెట్ చేయగా అంతా అయితే ఈ సినిమా నుంచి ఇద్దరినీ కలిపి ఉండే పోస్టర్ కోసం ఎదురు చూస్తుండగా మేకర్స్ అయితే ఫైనల్ గా దీనిపై అప్డేట్ ని అందించారు.

మరి ఈ సాలిడ్ పోస్టర్ అయితే రేపు మే 29న ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే ఈరోజే ఆ పోస్టర్ ఉంటుంది అని అంతా ఆశించారు కానీ ఒక్క రోజు అయితే డిలే అయ్యింది. ఇక సస్పెన్స్ లో ఈ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు