కమల్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.!

Published on Nov 24, 2021 3:08 pm IST


విశ్వ నటుడు కమల్ హాసన్ ఇటీవలే యూఎస్ నుంచి తిరిగి వస్తుండడంతోనే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా తాను కరోనా పాజిటివ్ అని తేలడంతో అభిమానులు కాస్త ఆందోళనకి గురయ్యారు. మరి అలాగే ఈ సమయంలోనే సినీ ప్రముఖులు సహా అభిమానులు కమల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

మరి ఇప్పుడు తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్ బులెటిన్ బయటకి వచ్చింది. ప్రస్తుతం కమల్ హాసన్ శ్రీరామ చంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నారని తన పారామీటర్స్ అంతా కంట్రోల్ లోనే ఉన్నాయని అలాగే తన ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని ఈ బులెటిన్ ద్వారా వైద్యులు తెలియజేసారు. ఇది కమల్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే వార్త అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More