అక్కడ ‘గాడ్ ఫాథర్’ షూట్ షురూ చేసిన మెగాస్టార్.!

Published on Sep 22, 2021 2:00 pm IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి నేటితో తన సినీ ప్రస్థానం 43 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ ఈ రోజును ప్రత్యేకంగా తీసుకోగా చిరు కూడా ఈ రోజున ఓసారి స్మరించుకున్నారు. మరి ఇదిలా ఉండగా టాలీవుడ్ కి గాడ్ ఫాథర్ అయ్యినటువంటి చిరు చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఒకటి కూడా ఈరోజే షూట్ షురూ చేస్తుండడం విశేషం.

ఇప్పుడు చిరు చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్స్ లో మళయాళ బ్లాక్ బస్టర్ రీమేక్ చిత్రం ‘లూసిఫర్’ కూడా ఒకటి. దీనిని తెలుగులో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మరి ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ కూడా రాగా ఇప్పుడు కొత్త షెడ్యూల్ షూట్ పై మేకర్స్ అప్డేట్ ని వదిలారు.

మరి దీని ప్రకారం ఈ చిత్రం షూట్ ఈరోజు ఊటీలో షురూ అయ్యినట్టు తెలుస్తుంది. అలాగే ఈ షూట్ లో చిరు సహా మరికొంతమంది కీలక నటులు కూడా పాల్గొన్నారట. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :