“ఆచార్య” షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే..!

Published on Sep 14, 2021 7:03 am IST


లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఆచార్య”. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంతే స్థాయి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాకపోవడం సస్పెన్స్ గా మారింది. మరి ఆల్రెడీ టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యిన ఈ చిత్రం రెండు పాటలు బ్యాలెన్స్ ఉంచుకున్నాయని మేకర్స్ తెలిపారు.

మరి ఇప్పుడు ఈ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ప్రస్తుతం మేకర్స్ ఓ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారట. మరి అలాగే ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.. మరి ఇది రెండో సాంగ్ నా లేక మళ్లీ ఇంకోటి బ్యాలన్స్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :