“ఆదిపురుష్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Aug 18, 2021 9:00 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో డైరెక్ట్ హిందీ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి ఈరోజుతో సంవత్సరం పూర్తయ్యినందున ఈ చిత్రం పేరు ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక దీనిని పక్కన పెడితే ఈ చిత్రం షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

నిన్ననే ఈ చిత్రం షూట్ నిమిత్తం ముంబై వెళ్లిన ప్రభాస్ షూట్ లో పాల్గొన్నాడట అంతే కాకుండా ప్రస్తుతం ప్రభాస్ మరియు కృతి సనన్ లపై సన్నివేస్లు తెరకెక్కిస్తున్నట్టుగా టాక్. అలాగే ఈ సన్నివేశాలను భారీ విజువల్స్ ఎఫెక్ట్స్ లో బ్లూ మాట్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఇంకొన్ని రోజులు పాటు వీరిపై కీలక సన్నివేశాలు కొనసాగానున్నట్టు తెలుస్తుంది. మారి ఈ చిత్రాన్ని దర్శకుడు రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తుండగా వచ్చే ఏడాది ఆగష్టు లో రిలీజ్ చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :