హీరో ఆది సాయికుమార్ హీరోగా, శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ‘శశి’ సస్పెన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక ఆది గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుందని.. ఆది ‘శశి’ అనే ఓ మాస్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన విడుదల చేసిన ఆది ఫస్ట్ లుక్ ను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్. పి.వర్మ, రామాంజనేయులు, శ్రీనివాస్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లవ్ అండ్ డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
