బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్న అజిత్ !

తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న చిత్రాలు ఈ ఏడాది ఒక్కటి కూడా విడుదలకాకపోవడంతో ఆయన అభిమానులు ఒక్కింత నిరాశ గురయ్యారు. ఇక ఇప్పుడు ఆయన అభిమానులకు శుభవార్త. వచ్చే ఏడాదిలో కేవలం మూడు నెలల గ్యాప్ తో అజిత్ నటిస్తున్న రెండు చిత్రాలు విడుదలకానున్నాయి.

అందులో భాగంగా అజిత్ నటించిన ‘విశ్వాసం’ జనవరిలో పొంగల్ కానుకగా విడుదలకానుంది. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈ చిత్రం తోపాటు ప్రస్తుతం అజిత్ , వినోత్ దర్శకత్వంలో తన 59వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది మే 1న విడుదలకానుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజిత్ లాయర్ గా కనిపించనున్నాడు.

Exit mobile version