అజిత్ కుమార్ 62 వ సినిమా పై బిగ్ అప్డేట్!

Published on Mar 18, 2022 10:40 pm IST


అజిత్ కుమార్ వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారిపోయారు. ఇప్పటికే వలిమై చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన హీరో, ఇప్పుడు మరొక సెన్సేషనల్ ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నారు. అజిత్ కుమార్ 62 వ సినిమా కి సంబందించిన అప్డేట్ పై తాజాగా క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రం కి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు. సుభాస్కరన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ లేటెస్ట్ బిగ్ అప్డేట్ తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :