బన్నీ సినిమా పై త్రివిక్రమ్ ప్రత్యేక దృష్టి

బన్నీ సినిమా పై త్రివిక్రమ్ ప్రత్యేక దృష్టి

Published on Jan 21, 2024 12:38 AM IST

‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోయే తన కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే, ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివక్రమ్ మరోసారి జత కట్టారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కానుంది. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకుంటున్నాడట.

ఇప్పటికే, త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫైనల్ చేసినా.. గుంటూరు కారం ఫలితం తర్వాత, బన్నీతో చేయబోయే సినిమా కథ పై మరింతగా కసరత్తులు చేయాలని నిర్ణయించుకున్నాడట. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. టైటిల్ మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాము అని మేకర్స్ చెప్పుకొచ్చారు. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు