హిందీలో “అల వైకుంఠపురములో” రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jan 18, 2022 1:49 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్” పాన్ ఇండియన్ లెవెల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూసాము. అలాగే ఓటిటి లో రిలీజ్ అయ్యాక ఈ భారీ సినిమాకి మరింత స్థాయిలో ఆదరణ మొదలైంది. మరి ఈ చిత్రానికి ముఖ్యంగా హిందీ ఆడియెన్స్ లో నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ రావడం అయితే అల్లు అర్జున్ అభిమానులని మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలని షాక్ గురి చేసింది.

దీనితో బన్నీ కి నార్త్ ఆడియెన్స్ లో ఈ రేంజ్ క్రేజ్ ఉందా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రేజ్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా నటించిన లాస్ట్ అండ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురములో” కూడా థియేట్రికల్ గా హిందీలో రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చేశారు. మరి లేటెస్ట్ గా ఈ ఈ సినిమా హిందీ రిలీజ్ పై అప్డేట్ బయటకి వచ్చింది.

దీని ప్రకారం ఈ చిత్రాన్ని ఇదే “అల వైకుంఠపురములో” టైటిల్ తోనే రిలీజ్ చేయడం ఫిక్స్ అయ్యింది అలాగే ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 26న రిలీజ్ చెయ్యబోతున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ చేసారు. ఇక ఈ సినిమా అక్కడ ఎలాంటి ఆదరణ వస్తుందో చూడాలి. మరి ఈ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది అలాగే థమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఈ సినిమాకి ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :