లేటెస్ట్..”అంటే సుందరానికి” ట్రైలర్ అప్డేట్ కి డేట్, టైం ఫిక్స్.!

లేటెస్ట్..”అంటే సుందరానికి” ట్రైలర్ అప్డేట్ కి డేట్, టైం ఫిక్స్.!

Published on May 28, 2022 2:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “అంటే సుందరానికి”. తన గత సినిమా “శ్యామ్ సింగ రాయ్” కి కంప్లీట్ డిఫరెంట్ లుక్ మరియు క్యారెక్టరైజేష్ లో నాని నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు. మరి రిలీజ్ కి దగ్గర పడుతున్న ఈ సినిమాపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ని చేస్తూ వెళ్తున్నారు. అలా ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ ని అందించారు.

ఈ ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తామో అనే దానిపై అప్డేట్ ఇస్తూ ఈ అప్డేట్ ని ఈ మే 30న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా తెలుగుతో పాటుగా తెలుగు మరియు తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ అవుతుండగా వాటి అప్డేట్స్ ని కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి దీని కోసం వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో నాని సరసన నజ్రియా ఫహద్ నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే జూన్ 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు