ఇండియా వైడ్ “అవతార్ 2” బుకింగ్స్ పై లేటెస్ట్ అప్డేట్.!

ఇండియా వైడ్ “అవతార్ 2” బుకింగ్స్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Nov 22, 2022 1:30 PM IST

మరోసారి ఇప్పుడు సోషల్ మీడియా మరియు ప్రపంచ వ్యాప్తంగా సినిమా దగ్గర మరోసారి మారుమోగుతున్న సినిమా పేరు “అవతార్ 2”. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ భారీ విజువల్ ట్రీట్ ఈ డిసెంబర్ లో రిలీజ్ కి వస్తుండగా ఈ భారీ చిత్రం అయితే ఎప్పుడు థియేటర్స్ లో పడుతుంది టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకోవాలా అని ఆసక్తిగా ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.

మరి ఈ చిత్రం అవతార్ ది వే ఆఫ్ వాటర్ బుకింగ్స్ అయితే ఈరోజు నుంచే మన దేశమో స్టార్ట్ కానున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఈరోజు నుంచే దేశ వ్యాప్తంగా అయితే అన్ని ప్రీమియం ప్లాట్ ఫామ్ లలో బుకింగ్స్ ని రిలీజ్ చేస్తుండగా ఇక ఈ భారీ చిత్రాన్ని చూడాలి అనుకున్న వారు ఈరోజు నుంచి తమ ముఖ్య ప్రాంతాల్లో అప్డేట్స్ చూడొచ్చు.

ఇక ఈ సినిమా ఇండియాలో మొత్తం 7 భాషల్లో రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా కోసం స్పెషల్ గా థియేటర్స్ ని మన దగ్గర కూడా రెడీ చేస్తున్నారు. అలాగే ఆడియెన్స్ కూడా అంతే ఎగ్జైటింగ్ గా సినిమాని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు