ఓటిటి: ‘బాహుబలి’ సిరీస్ పై లేటెస్ట్ అప్డేట్

ఓటిటి: ‘బాహుబలి’ సిరీస్ పై లేటెస్ట్ అప్డేట్

Published on Jul 7, 2024 11:03 AM IST


ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్ బాహుబలి చిత్రం సెట్ చేసిన స్టాండర్డ్స్ ఏ పాటివో ఇండియన్ ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఈ ఐకానిక్ చిత్రంకి ఓటిటి వెర్షన్ లో పలు సిరీస్ లు కూడా యానిమేషన్ వెర్షన్ లో వచ్చాయి. అలా రీసెంట్ గా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఆర్కా మీడియా వారు నిర్మాణం వహించిన యానిమేషన్ సిరీస్ “బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్” వచ్చింది.

మరి ఈ సిరీస్ ని కేవలం రెండు ఎపిసోడ్స్ ని మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దీనికి అప్పుడు కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇపుడు ఫైనల్ గా మొత్తం అన్ని ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చేసాయి. మొత్తం 9 ఎపిసోడ్స్ సీజన్ గా బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ స్ట్రీమింగ్ అవుతుంది. మరి మొదటి రెండు ఎపిసోడ్స్ తర్వాత మిగతా ఎపిసోడ్స్ బాగున్నాయి అని టాక్ వచ్చింది. మరి ఈ అన్ని ఎపిసోడ్స్ ని చూడాలి అనుకుంటే హాట్ స్టార్ లో వీక్షించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు