‘బాలయ్య’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

‘బాలయ్య’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Mar 14, 2023 12:42 AM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. బాలయ్య – శ్రీలీల కాంబినేషన్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. కిడ్నాప్ కి గురి అయిన శ్రీలీలను సేవ్ చేయడానికి బాలయ్య చేసే ఫైట్స్ ను చాలా వీరోచితంగా చిత్రీకరిస్తున్నారట.

మొత్తమ్మీద సినిమాలో శ్రీలీల – బాలయ్య కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ ట్రాక్ చాలా బాగుంటుందట. ఇక బాలయ్యకి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు