‘అఖండ’లో ఇక మిగిలింది హాస్పిటల్ సీక్వెన్సే !

Published on Sep 7, 2021 1:37 am IST

నటసింహం బాలయ్య బాబు – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి చేస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అఖండ’ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇక కేవలం హాస్పిటల్ సీక్వెన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అట. ఈ హాస్పిటల్ సీక్వెన్స్ సినిమాలోనే హెవీ ఎమోషనల్ గా సాగుతుందట. ఈ సీక్వెన్స్ మొత్తం బాలయ్య అఘోరా పాత్ర చుట్టూ సాగుతుందట.

మరి ఈ చిత్రంతో బాలకృష్ణ – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్.

సంబంధిత సమాచారం :