బాలయ్య ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ప్రస్తుతం ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ బాలయ్య రెండో పాత్రతో స్టార్ట్ అవుతుందని టాక్. ఈ చిత్రంలో బాలయ్య ఎప్పటిలాగే డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. పైగా బాలయ్య గెటప్ చాలా కొత్తగా ఉండబోతుంది. ఈ గెటప్ ఈ సినిమా మొత్తానికే కాకుండా, బాలయ్య సినీ కెరీర్ లోనే హైలెట్ గా నిలిచిపోతుందని, బాలయ్య ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేశారని టాక్ నడుస్తోంది.

మరి ఈ వార్త నిజమైతే, బాలయ్య అభిమానులకు ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది. కాగా ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version