బాలయ్య భారీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ?

బాలయ్య భారీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Published on Jun 20, 2022 6:03 PM IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా దాదాపు కీలక టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. అందుకే, ఈ సినిమా రిలీజ్ విషయంలో గత కొన్ని రోజులుగా రూమర్స్ ఎక్కువవుతున్నాయి. ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 23వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం బాలకృష్ణ పై హై యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. రామ్ – లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న ఈ సినిమాతో.. ఇక గోపిచంద్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు