“బంగార్రాజు” మరో సాంగ్ టీజర్‌కి ముహూర్తం ఫిక్స్..!

“బంగార్రాజు” మరో సాంగ్ టీజర్‌కి ముహూర్తం ఫిక్స్..!

Published on Jan 4, 2022 10:46 PM IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టిలు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం “బంగార్రాజు”. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని 4వ పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. ఇందులో భాగంగా జనవరి 5వ తేది సాయంత్రం 06:03 గంటలకు పాట ప్రోమోను విడుదల చేయనుంది. నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ ‘బంగార’ అనే టైటిల్‌తో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు