“భీమ్లా నాయక్” హిందీ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Feb 14, 2022 5:14 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ ఆల్ మోస్ట్ ఈ ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ చెయ్యొచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఇంకోపక్క ఈ చిత్రం తెలుగు రిలీజ్ తో పాటి హిందీలో కూడా చేస్తారని నిర్మాత నాగ వంశీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇక్కడ నుంచి భీమ్లా నాయక్ హిందీ రిలీజ్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఇప్పుడు ఈ హిందీ రిలీజ్ పైనే లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రం తాలూకా హిందీ థియేట్రికల్ రిలీజ్ హక్కులు బి4యూ మోషన్ పిక్చర్స్ వారు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం రిలీజ్ హిందీలో గ్రాండ్ గానే ఉండొచ్చని టాక్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందించారు.

సంబంధిత సమాచారం :