“భీమ్లా నాయక్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!

Published on Dec 16, 2021 9:05 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. మరి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ చిత్రం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందట.

మరి ఈ షూట్ లో పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. మరి ఇంకా ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది ఇది అయ్యి అనుకున్న సమయానికే వస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ చిత్రంలో నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :