“భోళా శంకర్” ఫస్ట్ ట్యూన్ పై అప్డేట్.!

Published on Oct 16, 2021 9:02 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రం కంప్లీట్ చేసి రెండు సాలిడ్ రీమేక్స్ కంప్లీట్ చేసే పనిలో పడ్డ సంగతి తెలిసిందే. అయితే వీటిలో ఇప్పుడు మళయాళ చిత్రం “లూసిఫెర్” కి రీమేక్ “గాడ్ ఫాథర్” చేస్తుండగా మరోపక్క తమిళ్ చిత్రం “వేదాళం” కి రీమేక్ “భోళా శంకర్” అయితే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్న మెహర్ రమేష్ ఈ చిత్రం పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి అందించాడు.

నిన్న దసరా అలాగే తమ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ బర్త్ డే కూడా కావడంతో ఈ ప్రత్యేక రోజున తాను ఒక బ్యూటిఫుల్ ట్యూన్ ని రెడీ చేసినట్టు కన్ఫర్మ్ చేశారు. మరి దీనితో ఆల్రెడీ భోళా శంకర్ కి కూడా వర్క్స్ శరవేగంగా జరిగిపోతున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ కి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా అనిల్ సుంకర నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :