‘దువ్వాడ జగన్నాథం’ మూవీ అప్డేట్ !
Published on May 2, 2017 5:54 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయిత్రే గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ పై సరైన అప్డేట్ దొరకలేదు. దీంతో అభిమానుల్లో కూడా అసలు సినిమా పొజిషన్ ఏంటి, షూట్ ఎక్కడి వరకు వచ్చింది అనే అంశాలపై కాస్తంత సందిగ్దత నెలకొంది. ఆ సందేహాలకు సమాధానంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఇంకో మూడు పాటలు, క్లైమాక్స్ మినహా మిగతా షూట్ మొత్తం పూర్తైందట. అల్లు అర్జున్ కూడా తన పాత్రకు ఈరోజే డబ్బింగ్ మొదలుపెట్టారని వినికిడి. అంతేగాక చివరి షెడ్యూల్ రేపటి నుండి మొదలయ్యే చాన్సులున్నాయని కూడా అంటున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ పెద్ద హిట్టవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక బన్నీ వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘నాపేరు సూర్య’ అనే సినిమాను మొదలుపెడతాడు.

 
Like us on Facebook