శంకర్ – చరణ్ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jun 8, 2022 12:30 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియాస్ మరో టాప్ డైరెక్టర్ శంకర్ తో ఒక భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు శంకర్ అలాగే రామ్ చరణ్ ల కెరీర్ లలో 15వ సినిమాగా ఇది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ ని శరవేగంగా జరుపుకుంటుండగా ప్రస్తుతం కొద్దిగా గ్యాప్ లో ఉంది.

మరి నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ పై అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ షూటింగ్ ని మేకర్స్ ఈ జూన్ 20 నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులు కితం వైజాగ్ లో షెడ్యూల్ ని కాస్త మధ్య లోనే ఆపాల్సి వచ్చింది మరి బహుశా ఆ షూటింగ్ స్టార్ట్ చేస్తారా లేక వేరే ప్లేస్ లో ప్లాన్ చేస్తున్నారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్ లో 50 వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :