చరణ్, శంకర్ భారీ ప్రాజెక్ట్ షూట్ పై నయా అప్డేట్..!

Published on May 24, 2022 7:03 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మరో బిగ్గెస్ట్ దర్శకుడు అయినటువంటి శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు రాజమౌళి అలాగే శంకర్ తో సినిమాలు చేసిన ఏకైక హీరోగా రామ్ చరణ్ నిలిచాడు. మరి ఈ సినిమాపై కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొనగా ఈ చిత్రం షూటింగ్ ని శంకర్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులు కితం వైజాగ్ లో షూటింగ్ చేసిన మేకర్స్ తర్వాత పలు కారణాల చేత సగం వరకు చేశారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్ ని మేకర్స్ ఈ వచ్చే జూన్ నెల మధ్యలో నుంచి స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారట. అయితే అది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు తమ బ్యానర్ లో ఈ సినిమాని భారీ అంచనాలు నడుమ 50వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :