చరణ్ – శంకర్ సినిమాలో సునీల్ పాత్ర అదే !

Published on Sep 13, 2021 6:00 pm IST

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సునీల్ పాత్ర కథలో చాలా కీలక పాత్ర అట. సినిమాలో సునీల్ ఒక డాక్టర్ గా కనిపించబోతునట్లు తెలుస్తోంది. మరీ ఈ సినిమాతో సునీల్ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

ఇక ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా నటించబోతుంది. అన్నట్టు భారీ బడ్జెట్ రాబోతున్న ఈ భారీ సినిమాలో చరణ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ భారీ సినిమాలో కూడా రామ్ చరణ్ ను చాల వినూత్నంగా చూపించడానికి హాలీవుడ్ నుంచి మేకప్ మెన్స్ రప్పించనున్నాడు.

సంబంధిత సమాచారం :