మరో ఇంట్రెస్టింగ్ పాత్రలో మెగాస్టార్ ?

Published on Jan 17, 2022 9:02 pm IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ పోతూ ఉన్నారు. ఇదే క్రమంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా చిరు ఒక సినిమాని ఫైనల్ చేశారు. కాగా ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగుతుందని.. ఒక విధంగా ఈ సినిమా పాత సినిమా ముఠామేస్త్రికి లేటెస్ట్ సీక్వెల్ లాంటి సినిమా అని తెలుస్తోంది. సినిమాలో చిరు పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. వెంకీ ఇప్పటికే చిరుకు కథ కూడా వివరించాడని, కథ చిరుకి బాగా నచ్చిందని తెలుస్తోంది.

ఇక మెగాస్టార్ ప్రస్తుతం ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’ లాంటి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాని కూడా ఇప్పటికే స్టార్ట్ చేశాడు. బాబీ సినిమా తర్వాత వెంకీ కుడుముల సినిమా ఉండే ఛాన్స్ ఉంది. కాగా ‘ఛలో, భీష్మ’ లాంటి వరుస హిట్స్ తో వెంకీకి మంచి గుర్తింపు వచ్చింది. ఏది ఏమైనా చిరు రీఎంట్రీ ఇస్తూ ఇలా వరుస సినిమాలు ఒప్పుకుంటున్న నేపథ్యంలో చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కోసం కొత్త కథలు రాయడం మొదలెట్టారు. ఇప్పటికే చిరుకు కొంతమంది లైన్స్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :