చిరు 150 వ సినిమా ఎంతవరకొచ్చిందంటే..!

chiranjeevi-2

తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మెగాస్టార్ చిరంజీవి’ 150 వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రంలోని కొన్ని కీలక జైలు సన్నివేశాలను 1వ షెడ్యూల్లో పూర్తి చేసిన టీమ్ రెండవ షెడ్యూల్ పనుల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ కు సమీపంలోని ‘సింగప్పగూడ’ అనే గ్రామంలో జరుగుతోంది. అక్కడ చిరంజీవిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రైతుల సమస్యలకు సంబందించిన సందేశాత్మక చిత్రంగా ఉండబోతోంది. ఈ చిత్రానికి మొదట ‘కత్తిలాంటోడు’ అన్న టైటిల్ పెడతారని వార్త వచ్చినప్పటికీ రామ్ చరణ్ టైటిల్ అదికాదని, కొత్తది ఆలోచిస్తున్నామని తెలిపాడు. ఆలాగే ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ ఎవరనేది కూడా ఇంకా నిర్ణయించలేదు. ఇకపోతే వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుంచాలని మెగా క్యాంప్ నిర్ణయించింది.